Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై మహానగరానికి ఉగ్ర (Terrorist) ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు ముంబై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతోపాటు మతపరమైన ప్రాంతాల్లో సైతం పోలీసులు భారీగా మోహరించారు.
ఆయా ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ సైతం నిర్వహించాలని ఆదేశించినట్లు నగర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు శనివారం వెల్లడించారు. నగరంలోని డీసీపీలు (డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్) కూడా తమ తమ జోన్లలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే ముందు జాగ్రత్త చర్యగా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు.
అయితే, పండుగల సీజన్ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10 రోజులపాటు గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న ముంబై వాసులు ఇప్పుడు దుర్గాపూజ, దసరా, దీపావళి పండగలు సిద్ధమవుతున్నట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశ ఉన్నందున నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
Also Read..
Kanpur Test: కాన్పూర్లో వర్షం.. రెండో రోజు ఆట ఆలస్యం
Eng Vs Aus: ఆస్ట్రేలియాపై 186 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విక్టరీ
Road Accident | ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ.. ఖమ్మం వాసులు ఇద్దరు మృతి