కాన్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం ఏర్పడింది. కాన్పూర్(Kanpur Test)లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఇంకా కవర్స్ అలాగే ఉన్నాయి. తొలి రోజు కూడా వర్షం వల్ల ఆట కేవలం 35 ఓవర్లు మాత్రమే సాగింది. బంగ్లాదేశ్ తొలి రోజు 3 వికెట్ల నష్టానికి 107 రన్స్ చేసింది. అయితే ప్రస్తుతం ప్లేయర్లు అంతా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. ఇంకా గ్రౌండ్‌పై కవర్స్ తీయలేదు. అంపైర్లు పిచ్‌ను పరీక్షించనున్నారు.
The start of play for Day 2 in Kanpur has been delayed due to rains.
Stay tuned for further updates.
Scorecard – https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 28, 2024
శుక్రవారం మొదలైన రెండో టెస్టుకు వరుణుడు పదే పదే అంతరాయం కల్పించాడు. వెలుతురు లేకపోవడం, వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40 బ్యాటింగ్, 7 ఫోర్లు), ముష్ఫీకర్ రహీమ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ (2/34) రాణించాడు.