లండన్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డే(Eng Vs Aus)లో.. ఇండ్లండ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. 186 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. దీంతో అయిదు వన్డేల సిరీస్ 2-2 సమంగా మారింది. 39 ఓవర్లకు కుదించిన నాలుగో వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ అయిదు వికెట్ల నష్టానికి 312 పరుగలు చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అత్యధికంగా 87 రన్స్ చేశాడు. మరో ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ 62 రన్స్ చేశాడు. మిచెల్ స్టార్క్ వేసిన చివరి ఓవర్లో అతను 28 రన్స్ రాబట్టాడు. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 రన్స్‌కు ఆలౌటైంది. తొలుత ఓ దశలో వికెట్ నష్టపోకుండా 68 రన్స్ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత మరో 58 పరుగులు జోడించి పది వికెట్లను చేజార్చుకున్నది. 50 ఓవర్ల ఫార్మాట్లో టాప్ టీమ్‌గా కొనసాగిన ఆస్ట్రేలియా.. దాదాపు 14 వన్డే విక్టరీల తర్వాత వరుసగా రెండు వన్డేల్లో ఓటమి చూవిచూసింది. ఆదివారం బ్రిస్టల్‌లో ఫైనల్ వన్డే మ్యాచ్ ఉంటుంది.
All-round excellence helps England tie the series against Australia at the Lord’s 👊#ENGvAUS 📝: https://t.co/xTz1c3svrg pic.twitter.com/XWFSB1zV09
— ICC (@ICC) September 28, 2024