Meghalaya murder : మేఘాలయ (Meghalaya) లో హనీమూన్ మర్డర్ (Honeymoon murder) పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. షిల్లాంగ్ (Shillang) లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో నిందితులు ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే.. రాజా హత్య తర్వాత నిందితులు మరో మహిళను హత్య చేయాలనుకున్న విషయాన్ని, పెళ్లికి మూడు నెలల ముందే రాజా హత్యకు కుట్ర జరిగిన విషయాన్ని రాబట్టారు.
తాజా రాజాది కిరాయి హంతకులు చేసిన హత్య కాదని పోలీసులు తేల్చారు. తాము కిరాయి కోసం హత్య చేయలేదని, రాజ్కుశ్వాహాతో స్నేహం కోసమే రాజారఘువంశీని హత్య చేశామని పోలీసుల విచారణలో నిందితులు విశాల్, ఆకాశ్, ఆనంద్ వెల్లడించారు. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌ల వివాహనం మే 11న జరిగింది. అప్పటికే భర్త హత్యకు కుట్రచేసిన సోనమ్.. ప్లాన్ ప్రకారం రాజాను హనీమూన్‌కు ఒప్పించింది.
మే 20న సోనమ్ దంపతులు హనీమూన్‌కు బయలుదేరారు. ముందుగా గువాహటిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి మేఘాలయకు చేరుకున్నారు. అక్కడ రెండు రోజులపాటు పలు ప్రాంతాలను సందర్శించారు. మే 23న ప్లాన్ ప్రకారం విశాల్, ఆకాశ్, ఆనంద్‌లు రాజాను హత్యచేశారు. ఆ తర్వాత ముగ్గురు హంతకులు, సోనమ్ కలిసి రాజా మృతదేహాన్ని లోయలో పడేశారు. అనంతరం వేర్వేరు మార్గాల్లో ఇండోర్‌కు వెళ్లారు.
అయితే విశాల్, ఆనంద్, ఆకాశ్‌లు రాజా రఘువంశీ హత్య కోసం రూ.20 లక్షలకు బేరం మాట్లాడుకున్నారని ప్రచారం జరిగింది. సోనమ్, ఆమె ప్రియుడు రాజ్కుశ్వాహ ఆ ముగ్గురికి రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పకున్నారని వార్తలు వచ్చాయి. అయితే అది కిరాయి హత్య కాదని తాజాగా పోలీసుల విచారణలో తేలింది. రాజ్‌కుశ్వాహతో స్నేహం కోసమే అతడి ముగ్గురు మిత్రులు అతడు చెప్పినట్లు హత్యకు పాల్పడ్డారని వెల్లడైంది.