Sourav Ganguly | మమత ఎంపీ సీటు కోసం సౌరవ్ గంగూలీ రాయబారం.. ప్రచారంలో నిజమెంత.. సౌరవ్ స్పందన ఇదే
Sourav Ganguly : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అదినేత్రి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్ చుట్టూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె పార్లమెంట్ స్తానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొరవ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
Sourav Ganguly : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అదినేత్రి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్ చుట్టూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె పార్లమెంట్ స్తానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొరవ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
ఆమె పార్టీ టీఎంసీ కూడా ఘోర పరాజయం పాలైంది. దీంతో ఇప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఆమె లోక్‌సభకు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం బెంగాల్లో ఎన్నికలేమీ లేవు. అందుకు తన పార్టీకి చెందిన బహరాంపూర్ ఎంపీ యూసుఫ్ పఠాన్‌ను రాజీనామా చేయించాలని భావిస్తున్నారు. ఆయన రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. ఆ స్తానం నుంచి మమత పోటీ చేస్తారు. అయితే, ఈ విషయంలో యూసుఫ్ పఠాన్‌ను ఒప్పించేదెవరు..? ఈ విషయంలోనే సౌరవ్ గంగూలీ పేరు తెరపైకి వచ్చింది. మమత తరఫున యూసుఫ్ పఠాన్‌తో సౌరవ్ గంగూలీ రాయబారం నడిపారని ప్రచారం జరుగుతోంది.
ఈ మేరకు బెంగాల్‌కు చెందిన ఒక పత్రిక కథనాన్ని ప్రచురించింది. యూసుఫ్ పఠాన్‌ను రాజీనామా చేయాలని సౌరవ్ గంగూలీ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని సౌరవ్ ఖండించారు. ఈ వార్తలో నిజం లేదన్నారు. తాను ఎప్పుడూ యూసుఫ్ పఠాన్‌ను కలవలేదన్నారు. తాను యూసుఫ్‌తో మద్యవర్తిత్వం వహించడం లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

