SS Rajamouli | ఆదివారం సూపర్‌స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ నుంచి అప్డేట్ వస్తుందా అని అటు మహేశ్ అభిమానులతో పాటు ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రమోషన్స్‌లో గోప్యత పాటించే జక్కన్న స్ట్రాటజీ ప్రకారం, ఈసారి టీజర్‌కు బదులుగా కేవలం కొత్త పోస్టర్లు లేదా స్పెషల్ స్టిల్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. ఆర్కియాలజిస్ట్ ‘రుద్ర’ పాత్రలో మహేశ్ బాబు నటిస్తున్న ఈ గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.