అమరావతి : ఏపీలో ఘోర ప్రమాదం తృటితో తప్పింది. వరద పరిస్థితిని ( Flood waters ) పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ప్రమాదవశాత్తు కొట్టుకుపోతుండగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA ) కూన రవికుమార్ ( Kuna Ravi Kumar ), కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు శుక్రవారం వరద ఉధృతి పరిస్థితిని పరిశీలించేం దుకు బోటులో బయలు దేరారు.
కొంతసేపటి తరువాత వరద ఉధృతి పెరగడంతో వారు కొట్టుకుపోతుండగా వారి వెంట ఉన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే స్పందించాయి. వారని తాళ్ల సహాయంతో ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వరద ఉధృతిలో కొట్టుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే
శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లి వరదలో కొట్టుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు
ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ సహా అధికారులను కాపాడిన NDRF, SDRF బృందాలు pic.twitter.com/zA5OI2gAP0
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2026