Prasann Chand Mehta | జోధ్‌పూర్ మేయర్‌గా ప్రసన్న చాంద్ మెహతా.. మరో రెండు మేయర్ స్థానాలు బీజేపీకే
Prasann Chand Mehta : రాజస్థాన్‌లోని మూడు నగరాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. జోధ్‌పూర్ మున్సిపల్ మేయర్‌గా బీజేపీ నుంచి ప్రసన్న చాంద్ మెహతా ఎన్నికయ్యారు.
Prasann Chand Mehta : రాజస్థాన్‌లోని మూడు నగరాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. జోధ్‌పూర్ మున్సిపల్ మేయర్‌గా బీజేపీ నుంచి ప్రసన్న చాంద్ మెహతా ఎన్నికయ్యారు. జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బీజేపీ నేత సునీల్ కొఠారి, కోట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా అనసూయ గోస్వామి (బీజేపీ) ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ ముగ్గురూ ఆయా స్థానాల నుంచి ఎన్నికయ్యారు.
100 మంది జోధ్‌పూర్ కౌన్సిలర్లు ఎన్నికల్లో పాల్గొనగా.. బీజేపీ అభ్యర్థికి 53 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 47 ఓట్లు పడ్డాయి. ఆరు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ప్రసన్న చాంద్ మెహతా ఎన్నికయ్యారు. తన గెలుపుపై ప్రసన్న హర్షం వ్యక్తం చేశారు. జైపూర్ మేయర్ స్థానానికి జరిగిన ఎన్నికలో సునీల్ కొఠారి బీజేపీ నుంచి మేయర్‌గా ఎన్నికయ్యారు. 150 సభ్యులున్న కార్పొరేషన్లో బీజేపీకి 89 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు 60 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో సునీల్ కొఠారి మేయర్‌గా గెలిచారు. కోట మున్సిపల్ స్థానానికి జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అనసూయ గోస్వామి మేయర్‌గా ఎన్నికయ్యారు. అనసూయకు 65 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 35 ఓట్లు వచ్చాయి.
ఇందులో బీజేపీకి 59 అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు. మిగతా నాలుగు ఓట్లు కాంగ్రెస్ నుంచి వచ్చాయి. కాంగ్రెస్‌కు 39 మంది సభ్యులుండగా.. 35 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. నలుగురు కాంగ్రెస్ సభ్యులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి మద్దతుగా నిలిచారు. అయితే, సీక్రెట్ ఓటింగ్ జరగడం వల్ల ఏ సభ్యుడు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డాడు అనే విషయాన్ని గుర్తించడం కష్టం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

