Car Fire | అందరూ చూస్తుండగానే ఓఆర్ఆర్పై కారు దగ్ధం.. ఇంతకీ ఆ కారు ఎవరిదంటే..?
Car Fire | స్కార్పియో కారు దేవతల గుట్ట వద్దకు రాగానే ముందు భాగంలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపేశాడు. ఈలోపే కారులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే కారు అగ్నికి ఆహుతైంది.
Car Fire | బొల్లారం, జూన్ 6 : బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు అగ్నికి ఆహుతైంది. సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం బొల్లారం ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి ప్రయాణిస్తుండగా దేవతల గుట్ట వద్దకు రాగానే స్కార్పియో కారు ముందు భాగంలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపేశాడు. ఈలోపే కారులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే కారు అగ్నికి ఆహుతైంది.
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికంగా ఉన్న ఓ వాటర్ ట్యాంకర్‌తో చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పి వేశారు. పోలీసులు ప్రమాదానికి గురైన కారు గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్‌కు సంబంధించినదిగా గుర్తించారు.
మేడ్చల్ నుంచి పటాన్ చెరు వైపుగా వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు ఏసీలో తలెత్తిన రిపేర్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనపై సిఐ రవీందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also :
Good news | వైద్య నిపుణులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Bollaram PS
- Car Fire
- Hyderabad
- ORR
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

