IMD | రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు.. భారత వాతావరణ కేంద్రం వెల్లడి..!
IMD | తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలిస్తోంది. ఈ క్రమంలో జూన్ 7న రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
IMD : తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలిస్తోంది. ఈ క్రమంలో జూన్ 7న రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఎండీ వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం.. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ పలుచోట్ల ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో రానున్న 24 గంటలపాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షపు జల్లులు పడే వీలుందని అంచనా వేశారు. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

