Mayawati : ఇవాళ పార్లమెంట్ (Parliament) లో కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఎస్పీ అధ్యక్షురాలు (BSP Chief) మాయవతి (Mayawati) విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్లో ప్రజా సమస్యల కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఈ మేరకు మాయవతి తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. దేశం అధిక జనాభా (Massive population) , ద్రవ్యోల్బణం (Infaltion), పేదరికం (Poverty), నిరుద్యోగం (Unemployment).. రోడ్లు (Roads), తాగునీరు (Water), విద్య (Education), వైద్యం లాంటి కనీస సదుపాయాల కొరత తదితర సమస్యలను ఎదుర్కొంటున్నదని, కేంద్ర బడ్జెట్లో ఇవేవీ ప్రస్తావనకు రాకపోవడం చాలా బాధాకరమని అన్నారు.
ఏండ్ల కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్నే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తూ వస్తున్నాయని మాయావతి మండిపడ్డారు. ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తే సామాన్య ప్రజలకు మేలు జరగదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటే ప్రజా సమస్యలకు పరిష్కారం లభించదని వ్యాఖ్యానించారు. బీజేపీ ‘డెవలప్డ్ ఇండియా’ విజన్‌లో బహుజనులను కూడా కలుపుకుపోవాలని ఆమె చురకవేశారు.
2.किन्तु वर्तमान भाजपा सरकार का भी बजट, कांग्रेस की ही तरह, राजनीतिक स्वार्थ का अधिक व जन एवं देशहित का कम लगता है। अगर ऐसा नहीं है तो इस सरकार में भी लोगों का जीवन लगातार तंग, बदहाल व दुखी क्यों? ’विकसित भारत’ का सपना बहुजनों के हित का भी होना जरूरी।
— Mayawati (@Mayawati) February 1, 2025
Shashi Tharoor | ఉద్యోగం ఉంటే పన్ను ప్రయోజనం.. మరి నిరుద్యోగుల సంగతేంది..? : శశిథరూర్
Road accident | అదుపుతప్పి కాలువలో పడ్డ వాహనం.. ఏడుగురు దుర్మరణం
Viral Video | రైల్లో టీటీఈ లంచావతారం.. వీడియో తీస్తున్న ప్రయాణికుడికి వార్నింగ్
Mahakumbh | మహా కుంభమేళాలో 77 దేశాల దౌత్యవేత్తల బృందం సందడి.. Video
Anna Beatriz | పోర్న్ సీన్ షూటింగ్ అనంతరం బిల్డింగ్‌పై నుంచి పడి స్టార్ నటి మృతి..!
Custom duty | కేంద్ర బడ్జెట్.. 36 రకాల ఔషధాలపై 100 శాతం పన్ను మినహాయింపు
Income Tax | వేతన జీవులకు భారీ ఊరట.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు