Man Missing | ముంబై నుంచి కోల్‌కతా (Mumbai to Kolkata) వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో తోటి ప్రయాణికుడితో చెంపదెబ్బతిన్న వ్యక్తి మిస్సైనట్లు (Man Missing) కుటుంబ సభ్యులు ఆరోపించారు. అస్సాంలోని కాచర్ జిల్లాకు చెందిన 32 ఏండ్ల హుస్సేన్ అహ్మద్ మజుందార్ గురువారం ఇండిగో 6E-2387 విమానంలో ముంబై నుండి కోల్‌కతా మీదుగా సిల్చార్కు ప్రయాణించాడు. అయితే, విమానంలో ఓ వ్యక్తి మజుందార్ చెంపపై బలంగా కొట్టాడు. విమానం కోల్‌కతా చేరుకున్న తర్వాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. అయితే, అప్పటి నుంచి మజుందార్ ఇప్పటి వరకూ ఇంటికి వెళ్లలేదని అస్సాంలోని తన ఫ్యామిలీ తెలిపింది. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని పేర్కొంది.
మజుందార్ ముంబైలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడని, గతంలో అనేకసార్లు విమానంలో ఆరూట్లో ప్రయాణించినట్లు తెలిపారు. అతన్ని పిక్ చేసుకునేందుకు కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం సిల్చార్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లినట్లు చెప్పారు. కానీ అతను ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు. అయితే, విమానంలో చెంబదెబ్బ వీడియో వైరల్ కావడంతో అతన్ని సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చినట్లు ఆయన తండ్రి అబ్దుల్ మన్నన్ మజుందార్ తెలిపారు. ఇండిగో, విమానాశ్రయ అధికారులు కూడా తమ కుమారుడి ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోయారు. ఈ ఘటనపై ఉదయర్బాండ్ పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
This video (from social media) shows a man assaulting a Muslim passenger on an @IndiGo6E flight. Date unclear, but such threats are a danger to society. Strictest action must be taken.
Request @MoCA_GoI @HMOIndia @DGCAIndia @PMOIndia to act now.#IndiGo #PassengerSafety pic.twitter.com/Bl0Lkf1QtK— ABDUR RUB (@Adv_AbdurRub_HC) August 1, 2025
Also Read..
IndiGo | విమానంలో వ్యక్తి హల్చల్.. తోటి ప్రయాణికుడి చెంప చెళ్లుమనిపించి.. VIDEO
Dead Economy | భారత్‌ది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు.. AI ఏం సమాధానం చెప్పిందంటే..?
Dam Collapses | ఆకస్మిక వరదలకు కూలిన కాఫర్‌డ్యామ్.. కొట్టుకుపోయిన వాహనాలు.. షాకింగ్ దృశ్యాలు