Dead Economy | ‘భారత్‌ది డెడ్ ఎకానమీ..’ (Indian economy is dead) అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే క్షీణించిన ఈ ఆర్థిక వ్యవస్థను మరింత పతనానికి దిగజార్చుతున్నారని ఆరోపించారు. ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘భారత్‌ది డెడ్ ఎకానమీనా..?’ అంటూ అమెరికాకు చెందిన ఐదు ఏఐ (AI) ప్లాట్‌ఫామ్‌లు చాట్‌జీపీటీ, గ్రోక్, జెమిని, మెటా ఏఐ, కోపైలట్లను ప్రశ్నించగా.. అవి ఆసక్తికరంగా సమాధానాలిచ్చాయి. ఆ సమాధానాలు అధ్యక్షుడి వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్నాయి.
చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే..?
‘భారత ఆర్థికవ్యవస్థ పతనం కాలేదు. ఇది డైనమిక్. ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది’ అని చాట్‌జీపీటీ (ChatGPT) సమాధానమిచ్చింది.
గ్రోక్ ఇలా..
‘లేదు. భారత్‌ది డెడ్ ఎకానమీ కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి’ అని Grok పేర్కొంది.
Gemini – ‘భారత ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతుంది’
Meta AI – ‘భారత్‌ది డెడ్ ఎకానమీ కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి’
Copilot – ‘డెడ్ ఎకానమీకి దగ్గరగా కూడా లేదు. నిజానికి ఇది చాలా వ్యతిరేకం’ అంటూ సమాధానాలిచ్చాయి.
Also Read..
Donald Trump: అయితే ఇండియా మంచి నిర్ణయమే తీసుకుంది: డోనాల్డ్ ట్రంప్
Russia – America | రష్యా- అమెరికా డెడ్‌లాక్! రెండు అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తత