Russian Oil Imports | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలతో రష్యా (Russia) నుంచి భారత్ (India) ఇంధనాన్ని (Russian Oil Imports) కొనుగోలు చేయడం లేదంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం లేదని తెలిసిందని, ఇది మంచి నిర్ణయమని అన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ వర్గాలు (Government sources) స్పందించాయి. ఆ వార్తలను తోసిపుచ్చాయి. భారత చమురు శుద్ధి సంస్థలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు శనివారం స్పష్టం చేశాయి. ఇంధన దిగుమతులు మార్కెట్ డైనమిక్స్, జాతీయ ప్రయోజనాల దృష్టా జరుగుతున్నాయని పునరుద్ఘాటించాయి. భారత చమురు సంస్థలు రష్యన్ దిగుమతులను నిలిపివేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశాయి.
కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మాస్కో నుంచి భారత్ పెద్ద మొత్తంలో చౌక ధరకు చమురు కొనుగోలు (Russia Oil Imports) చేస్తోంది. దీనిపై పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. మాస్కోతో వ్యాపారం చేస్తోందన్న కారణం చూపుతూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump).. భారత్‌పై పెనాల్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను దేశీయ సంస్థలు నిలిపివేశాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి భారత్‌కు చెందిన ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థలు (Indian Oil Companies) గత వారం రోజులుగా మాస్కో నుంచి చమురు దిగుమతులను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలపై అధ్యక్షుడు ట్రంప్కూడా స్పందించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి ఇంధనాన్ని ఇండియా కొనుగోలు చేయడం లేదని తెలిసిందని, ఇది మంచి నిర్ణయమని ట్రంప్(Donald Trump) అన్నారు. అయితే దీనిపై సమగ్రమైన వివరాలు తెలియదన్నారు. ఇక ముందు రష్యా నుంచి ఇంధనాన్ని ఇండియా దిగుమతి చేసుకోదన్న వార్తలు వినిపించాయని, దాంట్లో ఎంత వాస్తవం ఉందో తనకు తెలియదని, ఒకవేళ అదే నిజమైతే అది మంచి నిర్ణయమని, దీనిపై పునరాలోచన చేస్తామని ట్రంప్ అన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వివిధ దేశాలపై ట్రంప్ సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ప్రకారం ఇండియాపై 25 శాతం పన్ను పడనున్నది. అయితే రష్యా నుంచి సైనిక వస్తువులు, ఇంధనాన్ని కొనుగోలు చేస్తే భారత్‌పై పెనాల్టీ వేస్తామని ట్రంప్ అన్నారు. కానీ ఎంత పెనాల్టీ కట్టాలన్న దానిపై ఆయన ఏమీ క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే చమురు దిగుమతి ఆగిందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
Also Read..
Donald Trump: అయితే ఇండియా మంచి నిర్ణయమే తీసుకుంది: డోనాల్డ్ ట్రంప్
Russia – America | రష్యా- అమెరికా డెడ్‌లాక్! రెండు అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తత