న్యూఢిల్లీ: వైద్యశాస్త్రంలో ఇదో అద్భుతం. దాదాపు మూడు దశాబ్దాలపాటు శీతలీకరించిన ఓ పిండం నుంచి తాజాగా ఓ ఆరోగ్యకరమైన శిశువు జన్మించింది. గత నెల 26న జన్మించిన థాడెస్ డేనియల్ పియర్స్ అనే శిశువు ప్రపంచంలోనే ‘అత్యంత పురాతన శిశువు‘గా రికార్డులకెక్కింది. ఓహియోలోని లండన్‌కు చెందిన లిండ్సే పియర్స్, టిమ్ పియర్స్ దంపతులు 1994లో ఓ మహిళలో సృష్టించిన పిండాన్ని దత్తత తీసుకున్నారు. ఇప్పుడా పిండం నుంచి చిన్నారి జన్మించింది.
పుట్టుక కష్టంగా ఉన్నప్పటికీ ఇప్పుడు తామిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని లిండ్సే పేర్కొంది. ఈ అమూల్యమైన శిశువు తమకు లభించడం అద్భుతంగా అనిపిస్తున్నదని సంతోషం వ్యక్తంచేశారు. పిండాన్ని దానం చేసిన 62 ఏళ్ల లిండా ఆర్చర్డ్ మాట్లాడుతూ ఇది చాలా అసాధారణంగా ఉన్నదని, నమ్మశక్యం కాకుండా ఉన్నదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.