IndiGo | విమాన ప్రయాణంలో చోటు చేసుకునే కొన్ని ఘటనలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణికుల (passengers) ప్రవర్తన చర్చకు దారితీస్తుంటుంది. కొందరు వ్యక్తులు తప్పతాగి వికృతచేష్టలకు పాల్పడుతుంటారు. మరికొందరు తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఇండిగో (IndiGo) విమానంలో హల్చల్ చేశాడు. తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు.
ముంబై నుంచి కోల్‌కతా (Mumbai to Kolkata) వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. అతడి చెంప చెళ్లుమనిపించాడు. ఎందుకు కొట్టావని అడగ్గా.. అతని వల్ల తనకు సమస్య ఎదురైందని చెప్పాడు. ఈ ఘటనతో విమానంలో గందరగోళం నెలకొంది. అతడి ప్రవర్తనకు విమానంలోని వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. విమాన సిబ్బంది ఈ ఘటనపై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
This video (from social media) shows a man assaulting a Muslim passenger on an @IndiGo6E flight. Date unclear, but such threats are a danger to society. Strictest action must be taken.
Request @MoCA_GoI @HMOIndia @DGCAIndia @PMOIndia to act now.#IndiGo #PassengerSafety pic.twitter.com/Bl0Lkf1QtK— ABDUR RUB (@Adv_AbdurRub_HC) August 1, 2025
ఇక ఈ ఘటనను ఇండిగో (IndiGo) సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వికృత ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత, గౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యనైనా తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. తమ సంస్థకు చెందిన అన్ని విమానాల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఎక్స్ పోస్టులో వెల్లడించింది.
We are aware of an incident involving a physical altercation on board one of our flights. Such unruly behaviour is completely unacceptable and we strongly condemn any actions that compromise the safety and dignity of our passengers and crew.
Our crew acted in accordance with…
— IndiGo (@IndiGo6E) August 1, 2025
Also Read..
Dead Economy | భారత్‌ది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు.. AI ఏం సమాధానం చెప్పిందంటే..?
Heart Attack | జిమ్‌లో వర్కౌట్స్ సమయంలో.. స్పృహకోల్పోయి వ్యక్తి మృతి