Heart Attack | దేశంలో ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా జిమ్ (Gym)లో వర్కౌట్స్ సమయంలో 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తులు కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలే కాలంలో అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి జిమ్లో అకస్మాత్తుగా స్పృహకోల్పోయి ప్రాణాలు కోల్పోయాడు.
మహారాష్ట్ర పూణె (Pune)లోని పింప్రి చించ్వాడ్ (Pimpri-Chinchwad) ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. 37 ఏళ్ల కులకర్ణి అనే వ్యక్తి జిమ్లో వర్కౌట్స్ చేశాడు. అనంతరం తన బాటిల్లోని నీరు తాగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు. కాగా, కులకర్ణి భార్య కూడా వైద్యురాలే. ఆమెకూడా గుండెపోటు (Heart Attack)తోనే మరణించినట్లు తెలిసింది.
Also Read..
Himachal Pradesh: ఇలాగే కొనసాగితే.. హిమాచల్ ప్రదేశ్ అదృశ్యం కావొచ్చు : సుప్రీంకోర్టు వార్నింగ్
Donald Trump: అయితే ఇండియా మంచి నిర్ణయమే తీసుకుంది: డోనాల్డ్ ట్రంప్
Operation Akhal | ఆపరేషన్ అఖల్.. జమ్మూలో ఉగ్రవాది హతం