Operation Akhal | న్యూఢిల్లీ : పహల్గాం టెర్రర్ అటాక్ అనంతరం భారత సైన్యం.. ఉగ్రవాదులను ఏరివేసేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల వరుసగా ఆపరేషన్లు చేపట్టి.. ఉగ్రవాదులను మట్టుబెడుతుంది భారత సైన్యం. తాజాగా ఆపరేషన్ అఖల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున మరో ఉగ్రవాదిని భారత బలగాలు మట్టుబెట్టాయి.
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భారత నిఘా వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి భారత సైన్యం ఆపరేషన్ అఖల్ పేరిట కూంబింగ్ చేపట్టింది. బలగాలకు తారసపడ్డ ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఆపరేషన్ అఖల్ శనివారం ఉదయం నాటికి కూడా కొనసాగినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
OP AKHAL, Kulgam
Contact established in General Area Akhal, Kulgam. Joint Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/d2cHZKiC61
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) August 1, 2025