PCB | వరల్డ్‌కప్‌లో చెత్త ఆటకు 16 లక్షల జరిమానా.. పాకిస్థాన్ బోర్డు రియాక్షన్ ఇదే..!
PCB : పొట్టి ప్రపంచకప్‌లో చెత్త ఆట కనబరిచినందుకు స్క్వాడ్‌లోని ఒక్కొకరికి రూ.16 లక్షల జరిమానా విధించారనే వార్తలు వైరలయ్యాయి. అయితే.. ఆ దేశ క్రికెట్ బోర్డు మాత్రం అదేం లేదని అంటోంది.
PCB : పొట్టి ప్రపంచకప్ సూపర్ 8 దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ (Pakistan) జట్టుపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో చెత్త ఆట కనబరిచినందుకు స్క్వాడ్‌లోని ఒక్కొకరికి రూ.16 లక్షల జరిమానా విధించారనే వార్తలు వైరలయ్యాయి. అయితే.. ఆ దేశ క్రికెట్ బోర్డు మాత్రం అదేం లేదని అంటోంది. పాక్ ఆటగాళ్లపై జరిమానాపై శనివారం స్పందించిన పీసీబీ అధికార ప్రతినిధి అమిర్ మిర్.. అవన్నీ కట్టుకథలే అని కొట్టిపారేశాడు.
పదో సీజన్ పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు చెత్త ఆటతో సెమీస్‌కు ముందే ఇంటిదారి పట్టింది. సల్మాన్ అఘా సారథ్యంలోని పాక్ చివరి సూపర్ 8 మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచినా గ్రూప్ ఏ నుంచి నిష్క్రమించింది. దాంతో.. పాక్ క్రికెటర్ల ఆటపై స్వదేశంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో స్క్వాడ్‌లోని 15 మందిపై పాక్ బోర్డు కఠిన చర్యలు తీసుకుందని, ఒక్కొక్కరిపై రూ.16 లక్షల ఫైన్ వేసిందనే కథనాలు వచ్చాయి. కానీ, ఇవేవీ వాస్తవం కాదని ఆ దేశ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.
Pakistan Cricket Board denies the imposition of fines on members of its T20 World Cup squad for not reaching the semifinals of the tournament.
Details: https://t.co/pHCt87d9oK
📸 – AP pic.twitter.com/lslHbQOIHZ
— Sportstar (@sportstarweb) March 14, 2026
‘పాక్ క్రికెటర్లపై జరిమానా విధించారనేది అవాస్తవం. ఇప్పటివరకూ ఒక్కరిపైనా ఫైన్ వేయలేదు. కానీ, ఆటగాళ్ల ప్రదర్శనపై పీసీబీ అసంతృప్తితో ఉంది. బాగా ఆడినప్పుడు వారికి ప్రోత్సాహకాలు అందించాం. ఇప్పుడు చెత్తగా ఆడినందుకు కూడా తగిన పర్యావసానాలు ఉంటాయి. అయితే.. మీడియాలో వస్తున్నట్టు ఎవరిపైనా ఫైన్ మాత్రం వేయలేదు’ అని పీసీబీ అధికార ప్రతినిధి అమిర్ మిర్ మీడియాతో పేర్కొన్నాడు.
భారత్ చేతిలో చిత్తుగా..
పొట్టి ప్రపంచకప్‌లో లీగ్ దశలో భారత జట్టు చేతిలో చిత్తైన పాకిస్థాన్ సూపర్ 8కు చేరినా.. సెమీస్ గడప తొక్కలేదు. న్యూజిలాండ్‌తో సూపర్ 8 తొలి మ్యాచ్ వర్షార్పణం కావడం.. ఆపై ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాక్ అవకాశాల్ని దెబ్బతీశాయి. చావోరేవో పోరులో శ్రీలంకపై భారీ స్కోర్ చేసినా టీమిండియా రన్ రేటును అధిగమించలేక సల్మాన్ అఘా సేన నిష్క్రమించింది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

