Dam Collapses | హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా కులు (Kullu) జిల్లాలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో జిల్లాలోని మలానా-1 జలవిద్యుత్ ప్రాజెక్టు (Malana-I Hydropower Project)లో భాగమైన కాఫర్‌డ్యామ్ (cofferdam) ఒక్కసారిగా కూలిపోయింది.
ఆనకట్టు సమీపంలో ఉన్న భారీ యంత్రాలు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి (Vehicles Swept Away).హైడ్రా క్రేన్, డంపర్ ట్రక్, రాక్ బ్రేకర్, క్యాంపర్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆకస్మిక వరదలకు పార్వతి నది నీటి మట్టం పెరిగింది. దీంతో నదీ పరివాహ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Worrisome visuals coming from Malana Power Project Himachal — river in full fury after heavy rain, multiple vehicles washed away! IMD has issued alert for heavy rains in the next 3–4 hours.
Stay safe, stay alert! pic.twitter.com/YahzrpRYAk
— Nikhil saini (@iNikhilsaini) August 1, 2025
Also Read..
Brain Injury | బాత్రూమ్లో జారిపడ్డ మంత్రి.. బ్రెయిన్ ఇంజూరీతో ఆస్పత్రిలో చేరిక.. పరిస్థితి విషమం
Nobel Peace Prize | ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా..? భారత్ సమాధానం ఇదే
Dead Economy | భారత్‌ది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు.. AI ఏం సమాధానం చెప్పిందంటే..?