Nobel Peace Prize | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ఇవ్వాల్సిందేనని అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈజిప్ట్-ఇథియోపియా మొదలుకొని తాజాగా థాయ్‌లాండ్–కాంబోడియాల మధ్య యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొల్పేందుకు తీవ్రంగా కృషి చేశారని.. అందుకు అధ్యక్షుడికి కచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని వైట్‌హౌస్ (White House) మీడియా కార్యదర్శి కరోలిన్ లివెట్ (Karoline Leavitt) గురువారం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి అంశంపై భారత్ (India) తాజాగా స్పందించింది. ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాలా..? వద్దా..? అనే ప్రశ్నను వైట్‌హౌస్‌నే అడగాలని పేర్కొంది. ట్రంప్‌నకు నోబెల్ శాంతి ఇవ్వాలా..? అంటూ విలేకరుల ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ‘ఈ ప్రశ్నను మీరు వైట్‌హౌస్‌నే అడుగుతే మంచిదని నా అభిప్రాయం’ అంటూ పేర్కొన్నారు.
నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడే..
వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివెట్ (Karoline Leavitt) గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అన్నివిధాలా అర్హుడేనని అన్నారు. ఈజిప్ట్-ఇథియోపియా మొదలుకొని తాజాగా థాయ్‌లాండ్–కాంబోడియాల దాకా.. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సగటున నెలకు ఓ యుద్ధాన్ని నిలువరించారని కరోలిన్ చెప్పారు. దాడులు, ప్రతిదాడులతో రగిలిపోతున్న దేశాలను ఆయన శాంతింపజేశారని వివరించారు. ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు ఫోన్‌చేసి యుద్ధం ఆపేయాలని హెచ్చరించారని తెలిపారు. దాంతో పలు దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయాయని చెప్పారు.
ట్రంప్ జోక్యంవల్లే థాయ్‌లాండ్–కాంబోడియా, ఇజ్రాయెల్–ఇరాన్, రువాండా–కాంగో (డీఆర్సీ), ఇండియా–పాకిస్థాన్, సెర్బియా–కొసావో, ఈజిప్ట్–ఇథియోపియా దేశాల మధ్య యుద్ధాలు ఆగాయని కరోలిన్ అన్నారు. ట్రంప్ జోక్యం చేసుకోకుంటే ఈ యుద్ధాలవల్ల భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేదని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చి శాంతిని నెలకొల్పిన ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
Also Read..
“Nobel to Donald Trump | డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనట.. ఎందుకో తెలుసా..?”
“Donald Trump | నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను నామినేట్ చేసిన నెతన్యాహూ”
“ఇదేం సిఫారసు పాకిస్థాన్?.. ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన దాయాది ప్రభుత్వం”