వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరును మరో దేశాధినేత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి (Nobel Peace Prize) ప్రతిపాదించారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని ఆపినందుకు గాను ట్రంప్ పేరును 2026 నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన ట్రంప్‌తో కలిసి వైట్‌హౌస్‌లో డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా తాను అమెరికా అధ్యక్షుడి పేరును ప్రతిపాదిస్తూ నోబెల్‌కు పీస్ కమిటీకి లేఖ రాశానని చెప్పారు. తప్పనిసరిగా ఆయనకే ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కుతుందని తెలిపారు.
మనం మాట్లాడుతుండగానే ఆయన ఒక దేశంలో, ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతారంటూ నెతన్యాహూ వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో భేటీలో గాజాతో కాల్పుల విరమణ ఒప్పందం గురించి చర్చించారు. కాగా, నోబెల్ శాంతి బహుమతికి ఇప్పటికే పాకిస్థాన్ కూడా ట్రంప్ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇటీవల భారత్-పాక్ మధ్య ఏర్పడిన సంఘర్షణలను తన నిర్ణయాత్మక దౌత్యంతో నివారించి, గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించిన ట్రంప్ ఇందుకు అర్హుడని పేర్కొంది. ట్రంప్ నిజమైన శాంతి నిర్మాత అని ప్రశంసలు కురిపించింది. కాగా పాక్ నోబెల్ శాంతి ప్రతిపాదనను వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ధ్రువీకరించారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే నోబెల్ శాంతి బహుమతిని ప్రతిపాదించిన తర్వాతే మునీర్‌కు ట్రంప్ విందు ఇచ్చినట్లు తెలుస్తోంది.
#WATCH | Israeli Prime Minister Benjamin Netanyahu nominates US President Donald Trump for the Nobel Peace Prize
PM Netanyahu says, “I want to present to you, Mr President, the letter I sent to the Nobel Prize Committee. It’s nominating you for the Peace Prize, which is well… pic.twitter.com/D9QdLfw1fQ
— ANI (@ANI) July 7, 2025