షూటింగ్ ఉంటే లొకేషన్లో… లేకపోతే ఇంట్లో.. అంతేతప్ప లేడీ సూపర్‌స్టార్ నయనతారకు వేరే వెకేషన్సేమీ ఉండవట. తన ఖాళీ సమయాన్నంతా పిల్లలతో ఆడుకోవడం, భర్తకు ఇష్టమైన వంటలు చేసిపెట్టడంతోనే సరిపోతుందట. పైగా వంట చేయడంలో నయన్ సిద్ధహస్తురాలట. ఈ విషయం గురించి ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ ‘చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న ఫలితం ఇదంతా.
నేను ఏం ఐటమ్ చేసినా రుచిగా ఉంటుందని చాలామంది అంటుంటారు. నా భర్త విగ్నేష్కి టమాటా పప్పు చాలా ఇష్టం. నేను ఇంట్లో ఉంటే, ఆ రోజు వంటకాల్లో టమాటా పప్పు కచ్చితంగా చేస్తా. ఒక్కోసారి షూటింగ్స్ లేక గ్యాప్ ఎక్కువ వస్తుంది. దాంతో.. విఘ్నేష్‌కి రోజూ టమాటా పప్పే. ‘ప్లీజ్ వద్దు.. వేరేదేదైనా చేయ్..’ అని బతిమాలుతాడు. తనకోసం వేరే ఐటమ్ చేసినా, వాటితోపాటు టమాటా పప్పు కామన్’ అంటూ అందంగా నవ్వేసింది నయనతార.