భోపాల్: ఒక వృద్ధుడ్ని దోచుకునేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో బైక్‌కు కట్టి అతడ్ని ఈడ్చారు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. (Man Dragged Behind Bike) మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెమారియా గ్రామానికి చెందిన 60 ఏళ్ల లక్ష్మణ్ ప్రజాపతి శనివారం సాయంత్రం రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. ముగ్గురు వ్యక్తులు అతడ్ని దోచుకునేందుకు ప్రయత్నించారు. ఒక షాపు వద్ద అడ్డుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా, లక్ష్మణ్ ప్రజాపతి వారిని పట్టించుకోలేదు. అక్కడి నుంచి వెళ్తుండగా వారు అడ్డుకున్నారు. ఆ వృద్ధుడి మెడకు టవల్ చుట్టారు. బైక్‌కు కట్టి రోడ్డుపై కొంతదూరం ఈడ్చుకెళ్లారు. దీంతో లక్ష్మణ్ ప్రజాపతి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు ఈ సంఘటనపై లక్ష్మణ్ బంధువులు, స్థానికులు ఆగ్రహించారు. రేవా-సెమారియా రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించారు. ఒక నిందితుడైన కున్ను సాకేత్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Couple Jump From Pizza Shop | పిజ్జా షాపులో జంట.. హిందూ సంస్థ సభ్యులు రావడంతో ఏం చేశారంటే?
Man Killed Attacked Leopard | వ్యక్తిపై చిరుత దాడి.. దానిని ఎలా చంపాడంటే?