Maha Kumbh : మహా కుంభమేళా (Maha Kumbh) కు భక్తులు (Devotees) భారీ సంఖ్యలో పోటెత్తారు. తొలిరోజే భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రయాగ్‌రాజ్ (Prayagraj) పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తజన సందోహంతో త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి చేరుకుని, పుణ్య స్నానాలు ఆచరించి, మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు.
తొలిరోజైన సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు ఒక కోటి మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు నిర్వాహకులు తెలిపారు. తొలిరోజే ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాలో పాల్గొంటే మొత్తం 45 రోజుల్లో వచ్చే భక్తుల సంఖ్య అంచనాలకు మించి 45 కోట్లను దాటే అవకాశం ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాల కోసం భక్తకోటి తరలివచ్చిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | #MahaKumbh2025 | A large number of devotees arrive at Sangam to take a holy dip and participate in #MahaKumbhMela2025.
Up till 3 pm today, around 1 crore devotees took a holy dip in the Sangam area. pic.twitter.com/B9OnwkeVu1
— ANI (@ANI) January 13, 2025
Student suicide | ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థి ఆత్మహత్య
Offer | బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కంటే.. మధ్యప్రదేశ్ బోర్డు వినూత్న ఆఫర్..!
Kho Kho World Cup | నేటి నుంచే ఖో ఖో ప్రపంచకప్.. భారత్ తొలిపోరు ఎవరితో అంటే..!
Z-Morh Tunnel | సోన్మార్గ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇవీ టన్నెల్ ప్రత్యేకతలు
Maha Kumbh | యూపీ సర్కారుకు కాసులు కురిపించనున్న మహాకుంభమేళా.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?
Stock markets | కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం