Student suicide : పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT-Kharagpur) లో విద్యార్థి ఆత్మహత్య (Student suicide) కు పాల్పడ్డాడు. తన హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు. విద్యార్థిని కలిసేందుకు వచ్చిన అతని తల్లిదండ్రులు ఎంతసేపు తలుపుతట్టినా తీయకపోవడంతో సంస్థ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది తలుపులు విరగొట్టి చూడగా విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
వివరాల్లోకి వెళ్తే.. షోన్ మాలిక్ అనే విద్యార్థి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మాలిక్‌ను కలిసేందుకు అతని తల్లిదండ్రులు రాగా.. అప్పటికే మాలిక్ ఆత్మహత్య చేసుకున్నాడు. కలుద్దామని రాగా కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. కొడుకు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోధించారు.
మాలిక్‌తో శనివారం రాత్రే ఫోన్లో మాట్లాడామని, అంతా బాగానే ఉందని చెప్పాడని, ఇవాళ తాము వచ్చేలోపే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఘటనపై సమాచారం అందినే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ కమ్ అసెస్టెంట్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యలపై అంతర్గత దర్యాప్తు చేపట్టినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.
Offer | బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కంటే.. మధ్యప్రదేశ్ బోర్డు వినూత్న ఆఫర్..!
Kho Kho World Cup | నేటి నుంచే ఖో ఖో ప్రపంచకప్.. భారత్ తొలిపోరు ఎవరితో అంటే..!
Z-Morh Tunnel | సోన్మార్గ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇవీ టన్నెల్ ప్రత్యేకతలు
Maha Kumbh | యూపీ సర్కారుకు కాసులు కురిపించనున్న మహాకుంభమేళా.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?
Stock markets | కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం