హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ అవ్వడంతో గిరిజన, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. బాంబులు పేల్చి, స్వీట్లు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో మహబూబాబాద్ కలెక్టర్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా అభివృద్ధిని అడ్డుకుని, జిల్లాను నాశనం చేశాడని ఆరోపిస్తూ అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన నిర్ణయాల వల్ల జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ కలెక్టర్ బదిలీ అవ్వడంతో గిరిజన, బీసీ సంఘాల సంబరాలు
ఈరోజు జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ అవ్వడంతో, భారీ ఎత్తున టపాకాయలు పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న స్థానిక ప్రజలు
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా… pic.twitter.com/3kf7pG1PdR
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2026