Earthquake | ఇండోనేషియా (Indonesia)ని మరోసారి భారీ భూకంపం (Earthquake) వణికించింది. సుమత్రా (Sumatra) దీవుల్లో బుధవారం ఉదయం భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. కాగా, సమత్రా దీవుల్లో భూకంపం సంభవించడం వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం గమనార్హం.
గత నెల 27వ తేదీన కూడా అక్కడ భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం ఆషే ప్రావిన్స్‌కు సమీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున నమోదైంది. సైక్లోన్ సెన్యార్ (Cyclone Senyar) కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ దేశాన్ని ఇలా వరుస భూకంపాలు వణికించడం ఆందోళన కలిగిస్తోంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌కు సమీపంలో ఉన్నందున ఇండోనేషియాలో వరుస భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సుమామీలు తరచుగా సంభవిస్తుంటాయి.
Also Read..
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగదు: లోక్‌సభలో మంత్రి సింథియా
Alaknanda Galaxy: అలకనంద గెలాక్సీని గుర్తించిన భారత పరిశోధకులు
Bomb Threat | ఢిల్లీ కళాశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్