Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపాయి. నగరంలోని రెండు కళాశాలలకు బుధవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రెండు కళాశాలలకు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నార్త్ క్యాంపస్‌లోని రాంజాస్ కళాశాల, కల్కాజీలోని దేశ్‌బంధు కళాశాలకు (Deshbandhu College) ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన కళాశాల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులను, సిబ్బందిని బయటకు పంపి సోదాలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Delhi’s Deshbandhu College received a bomb threat via email today; Police are present at the spot, and no suspicious material has been found yet pic.twitter.com/VPRq3FeHVd
— ANI (@ANI) December 3, 2025
Also Read..
Spying | పాక్ కోసం గూఢచర్యం.. లాయర్ అరెస్ట్
Parliament | ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. గ్యాస్ మాస్కులతో పార్లమెంట్‌కు ఎంపీలు
PM Modi | చాయ్ అమ్ముతున్న ప్రధాని మోదీ.. వివాదాస్పద వీడియో షేర్ చేసిన కాంగ్రెస్