Parliament | దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా నమోదవుతోంది. దీంతో కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు గ్యాస్ మాస్కులు ధరించి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు.
#WATCH | #ParliamentWinterSession | Opposition MPs enter Parliament House wearing gas masks to protest against air pollution. pic.twitter.com/SkXYqAn9up
— ANI (@ANI) December 3, 2025
మరోవైపు కొత్త కార్మిక చట్టాల(Labour Laws)ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో కొత్త లేబర్ చట్టాలపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ వాయిదా తీర్మానం అందజేశారు. ఇటీవల కేంద్ర సర్కారు నాలుగు లేబర్ కోడ్లను ప్రకటించింది. కోడ్ ఆఫ్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూర్టీ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండీషన్స్ కోడ్‌ను అమలు చేయనున్నారు. నవంబర్ 21వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలులోకి తెచ్చారు. పార్లమెంట్ ఆవరణలో ఇవాళ భారీ బ్యానర్‌తో నిరసన చేపట్టారు. కార్పొరేట్ జంగిల్ రాజ్‌కు నో చెప్పాలని ఆ బ్యానర్లో డిమాండ్ చేశారు.
Also Read..
Minister L Murugan: తమిళనాడు రాజకీయాల వల్లే హిందీ భాష నేర్చుకోలేదు: కేంద్ర మంత్రి మురుగన్
PM Modi | చాయ్ అమ్ముతున్న ప్రధాని మోదీ.. వివాదాస్పద వీడియో షేర్ చేసిన కాంగ్రెస్
Kiran Bedi: వ్యవస్థను సరి చేస్తే.. స్వచ్ఛమైన గాలి వీస్తుంది: కిరణ్ బేడీ