న్యూఢిల్లీ: పుణె పరిశోధకులు కొత్త పాలపుంతను కనుగొన్నారు. దానికి అలకనంద అని నామకరణం చేశారు. ఆ నక్షత్రమండలం చాలా సుదూరంలో ఉన్నది. రాషీ జైన్, యోగేశ్ వాడదేకర్.. ఆ పాలపుంతను గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఆ గెలాక్సీని పసికట్టారు. అయితే విశ్వ విస్పోటనం జరగిన తర్వాత ఆ పాలపుంత ఏర్పడినట్లు భావిస్తున్నారు. ఆ గెలాక్సీ వయసు సుమారు 1.5 బిలియన్ల ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హిమాలయాల్లో ప్రవహించే అలకనంద నది పేరును ఆ గెలాక్సీకి పెట్టారు. సుమారు 30 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఆ పాలపుంత ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.ఆ గెలాక్సీ సుడులు తిరుగుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. యురోపియన్ జర్నల్ ఆస్ట్రోనామీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో ఈ రిపోర్టును పబ్లిష్ చేశారు.
రాషీ జైన్, యోగేశ్ పరిశోధకులు .. పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ కేంద్రంలో పనిచేస్తున్నారు. అలకనంద పాలపుంత నుంచి భూమికి కాంతి ప్రయాణించడానికి సుమారు 12 బిలియన్ల సంవత్సరాలు పట్టినట్లు రాషీ జైన్ తెలిపారు.