Rahul Gandhi | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ తనను మాట్లాడనివ్వట్లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఈ సమావేశాల్లో అధికార పక్షం పక్షపాతంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడటానికి అనుమతి ఇచ్చారని.. తనకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
‘పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులకు మాత్రం మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదు. నేను లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని. ప్రతిపక్ష నేతగా మాట్లాడే హక్కు నాకు ఉంది. కానీ వారు నన్ను మాట్లాడనివ్వట్లేదు. అభిప్రాయాలను తెలియజేసే అవకాశం నాకు ఇవ్వట్లేదు’ అని విమర్శించారు.
Also Read..
Air India | రన్‌వేపై అదుపుతప్పిన ఎయిర్ ఇండియా విమానం