Sambhal | దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్ (UP) లోని సంభల్ (Sambhal)లో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఓ ప్రార్థనా మందిరంలో సర్వే చేస్తుండగా అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ సంభల్‌కు బయల్దేరారు. అయితే, వారిని ఘాజీపూర్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
#WATCH | Lok Sabha LoP and Congress MPs Rahul Gandhi, Congress MP Priyanka Gandhi Vadra and other party leaders return to Delhi.
They were stopped by Police at the Ghazipur border on the way to violence-hit Sambhal. pic.twitter.com/eQhbU9DYhi
— ANI (@ANI) December 4, 2024
బారికేడ్లను వారి వాహనాలకు అడ్డుపెట్టారు. సంభల్ వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లను ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ కారు దిగి పోలీసులతో మాట్లాడినప్పటికీ వారు ఎలాంటి అనుమతీ ఇవ్వలేదు. చేసేదేమీ లేక రాహుల్, ప్రియాంక సరిహద్దు వద్దే వెనక్కి తిరిగారు. ఢిల్లీకి బయల్దేరారు.
#WATCH | Lok Sabha LoP and Congress MPs Rahul Gandhi, Congress MP Priyanka Gandhi Vadra and other party leaders sent back to Delhi from the Ghazipur border.
They were stopped by Police at the Ghazipur border on the way to violence-hit Sambhal. pic.twitter.com/qozEyL8QKs
— ANI (@ANI) December 4, 2024
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. మేము సంభల్‌కు వెళ్లాలనుకున్నాం.. కానీ పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. ‘సంభల్ వెళ్లేందుకు పోలీసులు మమ్మల్ని అనుమతించడం లేదు. LoPగా అక్కడికి వెళ్ళడం నా హక్కు. కానీ వారు నన్ను అడ్డుకుంటున్నారు. సంభల్ వెళ్లి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అక్కడ ఏం జరుగుతోందో చూడాలనుకుంటున్నాం. కానీ మమ్మల్ని అక్కడికి వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు’ అంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంభల్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అని, ఆయనకు రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయన్నారు. ఆయన్ని అడ్డుకోవడం సరికాదన్నారు.
#WATCH | At the Ghazipur border, Lok Sabha LoP Rahul Gandhi says “We are trying to go to Sambhal, the police is refusing, they are not allowing us. As LoP, it is my right to go, but they are stopping me. I am ready to go alone, I am ready to go with the police, but they did not… pic.twitter.com/iFWMQRKmk3
— ANI (@ANI) December 4, 2024
#WATCH | At the Ghazipur border, Congress MP Priyanka Gandhi Vadra says “Whatever happened in Sambhal is wrong. Rahul Gandhi is the leader of the opposition, he has constitutional rights and he cannot be stopped like this. He has the constitutional right to be allowed to go and… pic.twitter.com/abgStXCwCi
— ANI (@ANI) December 4, 2024
Also Read..
Air Pollution | ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం.. మెరుగుపడిన గాలి నాణ్యత
Devendra Fadnavis | మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ప్రమాణం.. అధికారిక ప్రకటన
Pune | బైక్ రైడర్‌ను బ్యానెట్‌పై ఎక్కించుకుని ఈడ్చుకెళ్లిన ఆడీ డ్రైవర్.. షాకింగ్ వీడియో