Air Pollution | గత కొన్ని రోజులుగా తీవ్ర వాయు కాలుష్యంతో (Air Pollution) ఉక్కిరిబిక్కిరి అయిన ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. రాజధాని ప్రాంతంలో బుధవారం గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా (Central Pollution Control Board) ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 211గా నమోదైంది. దీన్ని మోడరేట్ కేటగిరీ (Moderate Category) కింద సూచిస్తారు. కాగా, 20 రోజుల క్రితం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 మార్క్‌ను తాకి ప్రమాదకర స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాస్త తగ్గుతూ వచ్చింది. ఈ వారం మరింత తగ్గుముఖం పట్టింది. ఆదివారం 285, సోమవారం 273గా నమోదైన ఏక్యూఐ లెవల్స్.. మంగళవారం 268 వద్ద నిలిచిన విషయం తెలిసిందే. ఇవాళ ఇంకాస్త మెరుగుపడటంతో రాజధాని వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
మరోవైపు ఢిల్లీలో ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. సీజన్ సగటు కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇవాళ ఉదయం 8:30 గంటల సమయంలో ఢిల్లీలో తేమ స్థాయి 68 శాతంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
Also Read..
Devendra Fadnavis | మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ప్రమాణం.. అధికారిక ప్రకటన
Pune | బైక్ రైడర్‌ను బ్యానెట్‌పై ఎక్కించుకుని ఈడ్చుకెళ్లిన ఆడీ డ్రైవర్.. షాకింగ్ వీడియో