Pune | మహారాష్ట్ర పూణె (Pune)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆడీ కారు డ్రైవర్ బైక్ రైడర్ని ఢీ కొట్టి.. అలాగే మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ ఘటన పూణెలోని పింప్రి – చించ్వాడ్ టౌన్షిప్ వద్ద చోటు చేసుకుంది. డిసెంబర్ 1వ తేదీ రాత్రి సమయంలో లగ్జరీ ఆడీ కారు అతి వేగంగా వెళ్తూ.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్ రైడర్ కారు బ్యానెట్‌పైకి (Audis bonnet) ఎగిరిపడ్డాడు. అనంతరం కారును ఆపకుండా డ్రైవర్ అలాగే రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర ముందుకు వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
#Maharashtra #Pune: A bike rider in Pimpri Chinchwad was dragged on the bonnet of an Audi car for 2 kms after an altercation with the car driver on December 1.
The car driver along with his two friends has been arrested and booked under section 103 BNS.#Maharashtra pic.twitter.com/ZhNxrXwHtm
— Siraj Noorani (@sirajnoorani) December 3, 2024
Also Read..
Naga Chaitanya – Sobhita | చైతూ – శోభిత వివాహం.. గెస్ట్ లిస్ట్‌లో ఉన్నది వీళ్లే..!