Sukhbir Singh Badal: గోల్డెన్ టెంపుల్ గేటు వద్ద మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు..వీడియో
Sukhbir Singh Badal: పంజాబ్ మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై.. ఇవాళ ఉదయం అమృత్సర్ స్వర్ణదేవాలయంలో కాల్పులు జరిపారు. మతపరమైన శిక్షలో భాగంగా ఆలయం గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న సుఖ్‌బీర్‌పై ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు.
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయం గేటు వద్ద ఇవాళ ఉదయం సేవలో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal)పై కాల్పులు జరిగాయి. సిక్కు మత పెద్దలు వేసిన శిక్షలో భాగంగా సుఖ్బీర్ సింగ్.. స్వర్ణదేవాలయం గేటు వద్ద డ్యూటీ నిర్వహిస్తున్నారు. మెడలో ఫలక, చేతిలో బల్లెముతో .. మంగళవారం కూడా సుఖ్బీర్ సింగ్ విధులు చేపట్టారు. కాల్పులు జరపబోయిన షూటర్‌ను పట్టుకున్నారు. బాదల్‌తో పాటు గేటు వద్ద ఉన్న శిరోమణి నేతలు ఆ షూటర్‌ను అడ్డుకున్నారు. కొన్ని బుల్లెట్లు ఫైర్ అయ్యాయి. అయితే అదృష్టవశాత్తు సుఖ్బీర్కు ఏమీ కాలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి.. సుఖ్బీర్ దగ్గరకు రాగానే ప్యాంటులో నుంచి రివాల్వర్ తీసి ఫైర్ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో రిలీజ్ చేశారు.
#WATCH | Punjab: Bullets fired at Golden Temple premises in Amritsar where SAD leaders, including party chief Sukhbir Singh Badal, are offering ‘seva’ under the religious punishments pronounced for them by Sri Akal Takht Sahib, on 2nd December.
Details awaited. pic.twitter.com/CFQaoiqLkx
— ANI (@ANI) December 4, 2024
శిరోమణి అకాలీ దళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్.. మంగళవారం కూడా గోల్డెన్ టెంపుల్ గేటు వద్ద సేవాదార్ డ్యూటీ నిర్వహించారు. మతపరమైన శిక్షకు సంబంధించిన ఫలకను మెడలో వేసుకున్న ఆయన.. మరికొంత మంది నేతలతో కలిసి డ్యూటీ చేశారు. శ్రీ అకాల్ తక్త్ సాహిబ్ కింద ఆయనకు ఆ శిక్షను ఖరారు చేశారు. సాద్ నేత సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా కూడా మెడలో ఫలకను, చేతిలో బల్లాన్ని పట్టుకుని.. గేటు వద్ద సెంట్రీ విధులు నిర్వహించారు. సేవ చేయాలన్న ఆదేశం ఇచ్చారని, ఇది దేవుడు ఇచ్చిన ఆదేశంగా భావిస్తానని, అకాల్ తక్త్‌లో భాగంగా ఇది జరిగిందని, గేటు వద్ద కూర్చుంటానని, లంగర్లో కూడా సేవ చేయనున్నట్లు సుఖ్బీర్ బాదల్ తెలిపారు.
సుఖ్బీర్ మతపరమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు సిక్కు పెద్దలు ఇటీవల తీర్మానించారు. టంకయ్యగా ఆయనకు ముద్ర వేశారు. దీంతో శిక్షలో భాగంగా సుఖ్బీర్ స్వర్ణదేవాలయం గేటు వద్ద సేవలో పాల్గొన్నారు.
ఫైరింగ్‌కు పాల్పడిన నిందితుడిని నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతను గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన వ్యక్తి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

