Naga Chaitanya – Sobhita | అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు నాగచైతన్య (Naga Chaitanya) వివాహం ఇవాళ నటి శోభిత (Sobhita Dhulipala)తో జరగనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లో వీరి వివాహం పూర్తి సంప్రదాయ బద్ధంగా నిర్వహించనున్నారు. దాదాపు 8 గంటలపాటు పెళ్లి తంతు జరగనున్నట్లు తెలిసింది.
ఇక ఈ వేడుకకు అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతోపాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు (guest list). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు హాజరుకాబోతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా అగ్ర కథానాయకులు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ – ఉపాసన, మహేశ్ బాబు – నమ్రత, ప్రభాస్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సహా పలువురు అగ్ర తారలు, దర్శకులు హాజరుకానున్నారు.
పెళ్లి వేడుకలో భాగంగా ఇటీవలే కాబోయే కొత్త జంటకు హల్దీ వేడుకలు (Haldi Ceremony) నిర్వహించిన విషయం తెలిసిందే. చై-శోభిత జంటను ఒకేచోట ఉంచి మంగళస్నానాలు చేయించారు. అనంతరం శోభితను పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి మంగళహారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎరుపు రంగు చీరలో శోభిత మెరిసిపోతున్న ఫొటోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక పెళ్లిలో శోభిత బంగారు జరీ వర్క్‌తో కూడిన కాంచీవరం చీరను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. కాబోయే కోడలికి నాగార్జున ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఇటీవలే నాగ్ రూ.2.75 కోట్లతో లెక్సస్ లగ్జరీ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కారును కొడుకు, కోడలికి గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు బంగారు ఆభరణాలు ఇలా ఖరీదైన బహుమతులు శోభిత కోసం సిద్ధం చేసినట్లు టాలీవుడ్ సర్కిల్ నుంచి టాక్.
Also Read..
Nagarjuna Akkineni | యువ దర్శకుడితో నాగార్జున కొత్త సినిమా..
Daaku Maharaaj | బాలకృష్ణ డాకు మహారాజ్ ఫినిషింగ్ టచ్.. బాబీ టీం ఎక్జయిటింగ్ న్యూస్