Rashmika Mandanna | రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. దీక్షిత్‌శెట్టి కథానాయకుడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే టీజర్ విడుదల చేయనున్నారు. రీసెంట్గా టీజర్ చూసిన అగ్ర దర్శకుడు సుకుమార్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
రష్మిక క్లోజప్ షాట్స్, ఆమె హావభావాలు బాగున్నాయని, దర్శకుడు సరైన యాక్టర్స్‌ని సెలక్ట్ చేసుకున్నాడని సుకుమార్ అభినందించారు. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణం: గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటైర్టెన్మెంట్స్. ఇదిలావుంటే.. రష్మిక నటించిన తాజా చిత్రం ‘పుష్ప-2’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఆమె హిందీలో ఛావా, సికందర్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.