Nagarjuna Akkineni | ధనుష్ కథానాయకుడిగా రూపొందుతోన్న ‘కుబేర’ చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతి తర్వా త విడుదల కానుంది. మరి ఈ సినిమా తర్వాత నాగ్ ఏ సినిమా చేస్తారు? అనేది ఆయన అభిమానుల్లో నెలకొని ఉన్న ప్రశ్న. ‘నా సామిరంగ’ తర్వాత ఆయన హీరోగా సినిమా రాలేదు. అందుకే.. నాగార్జున సోలో హీరోగా నటించే సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నది.
వివరాల్లోకెళ్తే.. ‘హుషారు’ సినిమాతో యువతరాన్ని ఆకట్టున్న యువ దర్శకుడు హర్ష ఇటీవల నాగార్జునకి ఓ కథ వినిపించారట. ఆయన కథ నచ్చడంతో, సినిమా చేసేందుకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. జనవరిలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. హర్ష దర్శకత్వం వహించిన ‘ఓం భీం బుష్’ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.