Massive traffic jam | దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది (Massive traffic jam). ఉత్తరప్రదేశ్ (UP) లోని సంభల్ (Sambhal)లో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఓ ప్రార్థనా మందిరంలో సర్వే చేస్తుండగా అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ సంభల్‌కు బయల్దేరారు.
దీంతో పోలీసులు ఢిల్లీ నలుమూలలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ – సంభల్ మార్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఢిల్లీ – మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘాజీపూర్ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదులో సర్వే నేపథ్యంలో నవంబర్ 24న అక్కడ హింస చెలరేగింది. రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ హింసాకాండలో ఐదుగురు వ్యక్తులు మరణించగా పోలీసులతో సహా 30 మందికిపైగా గాయపడ్డారు.
#WATCH | Massive traffic snarl at the Ghazipur border on the Delhi-Meerut Expressway.
Security is heightened at the border as Lok Sabha LoP and Congress MPs Rahul Gandhi & Priyanka Gandhi Vadra are likely to visit violence-hit Sambhal today. pic.twitter.com/7t9VopTSnG
— ANI (@ANI) December 4, 2024
Also Read..
Peddapalli | పెద్దపల్లిలో సీఎం పర్యటన.. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు
ISRO | నేడు ఇస్రో కీలక ప్రయోగం.. కృత్రిమ సూర్య గ్రహణం సృష్టించడమే టార్గెట్!