Peddapalli | సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌తో పాటు మరో 20 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పెండింగ్ బిల్లులపై స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని తాజా మాజీ సర్పంచ్ల జేఏపీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు మరో 15 మందిని అరెస్టు చేశారు. అలాగే బీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ కొయ్యాడ సతీశ్‌తో పాటు మరో 20 మంది విద్యార్థి నాయకులను పెద్దపల్లిలో అరెస్టు చేశారు. రామగుండంలో పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేశారు.