Drummer Sivamani | ప్రఖ్యాత డ్రమ్మర్ శివమణి (Drummer Sivamani) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. డ్రమ్స్ వాయించడంలో ఆయన రూటే సపరేటు. అందుబాటులో ఉన్న దేని సాయంతో అయినా ఆయన అలవోకగా మ్యూజిక్‌ను వాయించగలరు. తాజాగా ఆయన దోశ తవాను (Dosa Statio) డ్రమ్స్లా మార్చుకుని అందరినీ ఆకట్టుకున్నారు.
బెంగళూరు (Bengaluru)లోని ఐకానిక్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ విద్యార్థి భవన్ (Vidyarthi Bhavan Restaurant)ను శివమణి సందర్శించారు. అక్కడ అల్పాహారం ఆస్వాదించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ కిచెన్‌లోకి వెళ్లిన శివమణి.. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. దోశలు వేసే పెనంపై చిన్న కప్స్ సాయంతో సంగీతం వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘శివమణి మ్యూజికల్ దోశ..’, ‘కాదేదీ సంగీతానికి అనర్హం’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
A rhythmic twist at #VidyarthiBhavan
The #LegendaryDrummer @drumssivamani visited us for #breakfast today & turned our humble kitchen into a stage. He mesmerised everyone with his #IncredibleTalent & #beats.
A #moment to cherish and #celebrate the fusion of art & tradition! pic.twitter.com/BgS38xvusD— Vidyarthi Bhavan (@VidyarthiBhavan) December 3, 2024
Also Read..
Pune | బైక్ రైడర్‌ను బ్యానెట్‌పై ఎక్కించుకుని ఈడ్చుకెళ్లిన ఆడీ డ్రైవర్.. షాకింగ్ వీడియో
Naga Chaitanya – Sobhita | చైతూ – శోభిత వివాహం.. గెస్ట్ లిస్ట్‌లో ఉన్నది వీళ్లే..!