Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం (Maharashtra CM) అభ్యర్థిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌నే (Devendra Fadnavis) మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ (BJP) చీఫ్ బుధవారం అధికారికంగా ప్రకటించారు.
బుధవారం ఉదయం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో.. సీఎంగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా.. ఏకగ్రీవంగా ఆమోదించారు. రేపు (డిసెంబర్ 5న) ముంబై ఆజాద్ మైదాన్‌లో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు. సీఎంతోపాటు ఇద్దరు ఉపముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. అజిత్ పవార్‌తోపాటు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. షిండేకు మరిన్ని కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక మహాయుతి నేతలు ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిసింది.
Devendra Fadnavis unanimously elected as the Leader of Maharashtra BJP Legislative Party. pic.twitter.com/015hrTDxtn
— ANI (@ANI) December 4, 2024
Also Read..
Naga Chaitanya – Sobhita | చైతూ – శోభిత వివాహం.. గెస్ట్ లిస్ట్‌లో ఉన్నది వీళ్లే..!
Pune | బైక్ రైడర్‌ను బ్యానెట్‌పై ఎక్కించుకుని ఈడ్చుకెళ్లిన ఆడీ డ్రైవర్.. షాకింగ్ వీడియో