Indigo Plane : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తర్వాత వరుసగా పలు విమానాల్లో సాంకేతిక లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఎయిరిండియా బోయింగ్ (AirIndia Boeing) డ్రీమ్ లైనర్ ఫ్లైట్లలోనే కాదు ఇండిగో విమానాల్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో, ఫ్లయిట్స్‌ను దారి మళ్లించడం వంటివి ఈమధ్య ఎక్కువయ్యాయి. తాజాగా అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. సరిపోను ఇంధనం లేకపోవడంతో అత్యవసరంగా ఇండిగో (Indigo Plane) విమానాన్ని మళ్లించారు పైలట్లు.
గురువారం ఇండిగో 6E6764 విమానం గువాహటి నుంచి చెన్నైకి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:45కి సదరు ఫ్లైట్ గమ్యానికి చేరుకోవాల్సింది. అయితే.. చెన్నై గగనతలంలోకి ప్రవేశించే సమయానికి ఇంధనం సరిపోను లేదని పైలట్లు గుర్తించారు. దాంతో, వెంటనే బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
– दिल्ली से लेह जा रही Indigo फ्लाइट 6E-2006 की इंमरजेंसी लैंडिंग
– तकनीकी गड़बड़ी के चलते सुरक्षा प्रोटोकॉल का पालन करते हुए लैंडिंग
– विमान में 182 यात्री थे, सभी को सुरक्षित दिल्ली उतारा गया
– विमान की जांच जारी#aviation #emergencylanding #TechnicalGlitch@ZeeBusiness pic.twitter.com/Yp0j9g5Gfj— Ambarish Pandey (@pandeyambarish) June 19, 2025
ఉదయం కూడా ఢిల్లీ నుంచి లేహ్‌కు బయల్దేరిన ఇండిగో (6E 2006) విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దాంతో, అప్రమత్తమైన పైలట్లు ఫ్లైట్‌ను వెనక్కి తిప్పారు. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.