Asain Squash Championships : ఆసియా స్క్వాష్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత కుర్రాడు వెలవన్ సెంథిల్ కుమార్ (Senthil Kumar) అదరగొట్టాడు. ఈ టోర్నీలో అద్భుత విజయాలు సాధిస్తూ పతకంపై ఆశలు రేపిన అతడు లక్ష్యానికి మరింత చేరువయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకం ఖరారు చేశాడు. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో మలేషియాకు చెందిన జోచిమ్ చౌహ్ను వరుస సెట్లలో మట్టికరిపించాడీ భారత స్టార్. ఫైనల్ బెర్తు కోసం అతడు రెండో సీడ్ లా త్సిజ్ క్వాన్(హాంకాంగ్)తో తాడోపేడో తేల్చుకోనున్నాడు.
తొలి మ్యాచ్ నుంచి చెలరేగి ఆడుతున్న సెంథిల్ క్వార్టర్స్‌లోనూ జోరు కొనసాగించాడు. 45 వ ర్యాంకర్ అయిన సెంథిల్ మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి జోచిమ్ చౌహ్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మూడు సెట్ల(11-7, 11-6, 11-6)లో జయకేతనం ఎగురువేశాడు. 3-0తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టాడు. తద్వారా దేశానికి కనీసం కాంస్యం ఖరారు చేశాడీ యువకెరటం.
#News l Velavan Senthilkumar advances to the Semi-final of the Asian Squash Championships
Velavan beat Joachim Chuah of Malaysia in three games
Final Score: 11-7, 11-6, 11-6.
📸Hong Kong Squash#Squash #AsianSquashChampionships pic.twitter.com/diqUBjhjJo
— The Bridge (@the_bridge_in) June 19, 2025
రెండేళ్ల క్రితం కాంటినెంటల్ మీట్లో వెండి పతకంతో మెరిసిన సెంథిల్.. ఈసారి ఆసియా స్క్వాష్ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడిపై గురి పెట్టాడు. మరోవైపు.. భారత కుర్రాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. దివర్కర్ సింగ్ రాహుల్ బైథాలు 32వ రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. సూరజ్ చంద్ ప్రీ-క్వార్టర్స్ దాటలేకపోయాడు.