Mla Marri Rajashekar Reddy | అల్వాల్, జూన్ 19 : సరస్వతి నిలయాలుగా ఉండాల్సిన సర్కారు బడులు సమస్యలకు నిలయంగా మారాయని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అల్వాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు సీసీ కెమెరాల ఏర్పాటు, అదనపు తరగతి గదులు, టీచర్ల కొరత, మౌలిక సదుపాయాలను కల్పించాలని ఉపాధ్యాయులు గురువారం బోయిన్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంటర్నేషనల్ విద్యా విధానం అందిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలోనే విఫలమైందన్నారు. ముందుగా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టాలన్నారు.
పాఠశాల సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ఉపాధ్యాయుడు వెంకటయ్య, ఉపాధ్యాయురాలు సబిత, సంగీత, అల్వాల్ వాసులు సురేందర్ రెడ్డి, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు