Domestic Cricket : దేశవాళీ క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆగస్టులో సీజన్ ఆరంభం కానుంది అనగా ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కొత్త జట్టుకు ఆడేందుకు సిద్ధమయ్యారు. వీళ్లలో ఒకరు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కరుణ్ నాయర్ (Karun Nair) కాగా.. మరొకరు ఐపీఎల్ ఛాంపియన్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ (Jitesh Sharma). గత సీజన్లో విదర్భ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరూ జట్టులో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదు. జితేశ్ బరోడా టీమ్‌తో మంతనాలు జరుపుతున్నాడు. నాయర్ తన స్వరాష్ట్రమైన కర్నాటకకు ప్రాతినిధ్యం వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.
నిరుడు సీజన్ 2024-25లో బరోడా సంచలన ప్రదర్శన కనబరిచింది. వరుస టోర్నీల్లో ప్రత్యర్థులకు షాకిచ్చిన ఆ జట్టు.. రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. విజయ్ హజారే ట్రోపీలో రన్నరప్‌గా సరిపెట్టుకున్న విదర్భ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. డొమిస్టిక్ టోర్నీల్లో విదర్భ విజయయాత్రలో కరుణ్ నాయర్ పాత్ర ఎనలేనిది.
India domestic news 🚨
Karun Nair and Jitesh Sharma are set to leave Vidarbha ahead of the upcoming domestic season.@vijaymirror reports 👇https://t.co/E9bpic4h13
— Cricbuzz (@cricbuzz) June 19, 2025
రంజీ ట్రోఫీలో 863 రన్స్ చేసిన అతడు వియ్ హజారేలో 779 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్లో మాత్రం అతడు కర్నాటకకు ఆడాలని అనుకుంటున్నాడు. ఈ విషయంపై కర్నాటక క్రికెట్ సంఘం కూడా స్పందిస్తూ నాయర్ తిరిగి తమ జట్టుతో కలవడం లాంఛనమే అని అంది. ఇక.. ఐపీఎల్ 18వ సీజన్లో రెచ్చిపోయి ఆడిన జితేశ్ ఈసారి విదర్బ తరఫున దేశవాళీలో చెలరేగాలని భావిస్తున్నాడు.