Disabled Assistive Devices | మెదక్ రూరల్, జూన్ 19 : వికలాంగుల సహాయ ఉపకరణముల పంపిణీకి ఆన్ లైన్ దరఖాస్తు గడువు ఈ నెల 27 వరకు పొడిగించినట్టు మెదక్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి హైమావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా అవసరమైన అర్హత కల్గిన వికలాంగులకు 2025-26 సంవత్సరానికిగాను వివిధ సహాయక ఉపకరణములు ఉచితంగా పంపిణీ చేయుటకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ఇందు కోసం https://tsobmms.cgg.gov.in నమోదు చేసుకోవచ్చునన్నారు.
నమోదు చేసిన దరఖాస్తుతోపాటు మెడికల్ బోర్డు సదరం సర్టిఫికెట్, ఆదాయ కుల, నివాస, వయస్సు, ధృవ పత్రములు కనిపించే పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు (3), ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యనభ్యసిస్తున్న బోనఫైడ్, కళాశాల వారి లేఖ (రెట్రో పిట్టేడ్ మోటో రైజ్డ్ వెహికిల్, ల్యాప్ టాప్, టబస్, మొబైలు బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికల్, 5జీ స్మార్ట్ ఫోన్స్ (నిరుద్యోగ శారీరక వైకల్యము గల వారు రెట్రో పిట్టెడ్ మోటోరైజ్డ్ వెహికిల్ కొరకు నోటరీతో అటెస్ట్ చేయబడిన రూ.100/- నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పై సెల్ఫ్ డిక్లరేషన్) జత పర్చి ఈ నెల 27 సాయంత్రం 5.00 గంటలలోపు దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, మెదక్ జిల్లా కార్యాలయంలో అందజేయాలని అన్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు