రామవరం, జూన్ 19 : పాలిటెక్నిక్ డిప్లొమా TGPOLYCET-2025 అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి, తుది దశల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ఎంపిక, సీట్ల కేటాయింపు జరుగనున్నట్లు రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ గురువారం తెలిపారు.
మొదటి దశలో
జూన్ 24 నుండి 28వ తేదీ వరకు ఆన్లైన్ నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు & స్లాట్ బుకింగ్
26 జూన్ నుండి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ (స్లాట్ బుక్ చేసిన అభ్యర్థులకు)
జూన్ 26 నుండి జూలై 01వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక
జూలై 01న ఆప్షన్ల ఫ్రీజింగ్
జూలై 04 వరకు ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు
జూలై 04 నుండి జులై 06 వరకు ఫీజు చెల్లింపు & సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వారికి సీటు కేటాయింపు ఉండదు. వెబ్ ఆప్షన్ అర్థంకాని వారు ఎవరైనా ఉంటే పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చని, సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ తెలిపారు.