నల్లగొండ విద్యా విభాగం, జూన్ 19 : నల్లగొండలోని డైట్ ప్రాంగణంలో గల ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో ఈ నెల 21న విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్యాల పాపయ్య గురువారం తెలిపారు. బీఈడీ, డీఈడీ చదువుతున్న విద్యార్థులు (ఛాత్రోపధ్యాయులు) అన్ని రంగాల్లో సంసిద్ధులయ్యేలా చైతన్యం చేసేందుకై ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా ఉదయం 9.30 గంటల నుంచి కళాశాల ప్రాంగణంలో
– పదో తరగతి, టెట్, డీఎస్సీ పరీక్షలు – సంసిద్ధత – ఒత్తిడి నిర్వహణ అనే అంశంపై ప్రముఖ పోటీ పరీక్షల నిపుణుడు, మెంటార్ తీగల జాన్ రెడ్డి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
– పాఠశాల అభివృద్ధి – సామాజిక వనరులు – సమన్వయం అనే అంశంపై వి.విజయభాస్కర్ రెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జడ్పిహెచ్ఎస్ మజీద్‌పూర్ రంగారెడ్డి జిల్లా, బొడ్డుపల్లి రామకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నల్లగొండ, మన ఊరు మన బడి- ప్రస్తుత ధోరణులు- మన బాధ్యత అనే అంశంపై వందేమాతరం రవీంద్ర హాజరై అవగాహన కల్పిస్తారని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ బి.బిక్షపతి, విశిష్ట అతిధులుగా వందేమాతరం రవీంద్ర, టీఎస్ జిహెచ్ఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. గిరిధర్ గౌడ్, విశిష్ట అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యా విభాగం విశ్రాంత సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్ బేగం, మహబూబ్‌నగర్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ మీర్జా ఉల్లాఖాన్, నల్లగొండ జిల్లా కామన్ పరీక్షల బోర్డు కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, డైట్ గొల్లగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం చందు నాయక్, నల్లగొండ డైట్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పి.వెంకటయ్య హాజరవుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఆత్మీయ అతిథులుగా టీఎస్ జీహెచ్ఎంఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.సర్దార్, జడ్చర్ల ఎంఈఓ కె.మంజులాదేవి, యాదాద్రి జిల్లా విశ్రాంత జిహెచ్ఎంలు బి.ఆగయ్య, ఆర్.నిర్మల, ఇండియన్ ఆర్మీ విశ్రాంత నయాబ్ సుబేదార్ చామల కేశవులు, టెక్ మహీంద్రా విశ్రాంత సీనియర్ మేనేజర్ వంగాల అంజిరెడ్డి హాజరవుతున్నట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ, డీఈడీ కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, ఛాత్రోపాధ్యాయులందరూ హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.